Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

స్నేహమేరా జీవితం..హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

స్నేహమేరా జీవితం..హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

సృష్టిలో తీయనైనది కలకాలం నిలిచిపోయేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి అదే స్నేహం. అనుబంధాలకు ఆత్మీయతకు చిరునామా స్నేహం. అనుభూతులకు నెలవై.. అనుభవాలకు కొలువై... వర్ణించడానికి వీలులేని అందమైనది అపురూపమైనది చెలిమి... పల్లె పట్టణం తేడా లేకుండా, వృత్తి ఏదైనా ప్రవృత్తి అంతరంగంలో అరమరికలు లేకుండా మనషులు వేరైనా మనసులో ఒకటిగా పెనవేసుకునేది చెలిమి. స్నేహానికి కులం.. మతం... అనే తారతమ్యం లేదు... స్నేహం పవిత్రమైంది... నిజమైన స్నేహానికి మించిన ఆస్తులు లేవు. సరిహద్దుల్ని చెరిపివేసి, వికాసానికి బాటలు వేసేది చెలిమి ఒక్కటే. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోబుట్టువులతో చెప్పుకొలేని ఎన్నో విషయాలను మిత్రులకు చెప్పుకోవడమంటే స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిస్వార్థంగా సాయం అందించే వారు నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో నాకేవరూ లేరు, నాకు చుట్టాలు, బంధువులు లేరు అనే వారు ఎక్కడైనా ఉంటారేమోగాని స్నేహితులు లేనివారు ఎవరూ ఉండరనేది అక్షర సత్యం. స్నేహానికి ధనిక, పేద స్త్రీ పురుష, కుల, మత వర్గ బేధాలు ఏమి కనిపించవు. ఈ సృష్టిలో నిజమైన స్నేహంకంటే విలువైన బహుమానం మరొకటి లేదు. కల్మషం లేని, కమ్మనేనైది స్నేహమొక్కటే. 

Post a Comment

0 Comments